తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 1లో తమకు కేటాయించాల్సిన స్థలాలు, ఇళ్ల కోసం ఉద్యమకారులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ హాజరై వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ ఉద్యమకారులతో మాట్లాడి వారి సమస్యలను, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. వారి న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత ప్రభుత్వ అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని బండి రమేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు