తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మబుబ్పేట్ విలేజ్ లోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని, గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, జాతిపితకు ఘన నివాళ్లు అర్పించి, గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియచేసిన మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్. ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ సత్యం, అహింస అనే ఆయుధాలతో భారత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించి, కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలు, సత్యం, అహింస, శాంతి, సమానత్వం వంటి విలువలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు,మహిళా నాయకురాల్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు.
