తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : స్థానిక యువతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో సూత్ర ఫౌండేషన్ మరియు బాలమిత్ర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 45 రోజుల ఉచిత బేసిక్ కంప్యూటర్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మణికొండ ప్రాంతంలో నిర్వహించిన ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 74 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలమిత్ర ఫౌండేషన్ ప్రతినిధులు చంద్రిక, పద్మలతో పాటు సూత్ర ఫౌండేషన్ ప్రతినిధులు అడ్వకేట్ మీనా లక్ష్మి, మౌనికలు హాజరై విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ… “ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికీ కంప్యూటర్ పరిజ్ఞానం ప్రాథమిక అవసరంగా మారింది. స్థానిక యువతీ యువకులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయో గించుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడం అభినందనీయం” అని పేర్కొన్నారు.

సాంకేతిక శిక్షణ ద్వారా యువత స్వయం సమృద్ధి సాధించడమే తమ ఫౌండేషన్ల ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.కొత్త బ్యాచ్‌లకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం:త్వరలో ప్రారంభం కానున్న తదుపరి బ్యాచ్‌లలో శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివరాలు: వయోపరిమితి: 15 నుండి 32 సంవత్సరాల మధ్య గల యువతీ యువకులు అర్హులు. శిక్షణ ప్రదేశం: మణికొండ, హైదరాబాద్. కోర్సు ఫీజు: పూర్తిగా ఉచితం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు క్రింది గూగుల్ ఫామ్ (గూగుల్ ఫామ్ ) లింక్https://forms.gle/apkA2b3p SaMe3v936 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు.
