తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  కాటేదాన్ ఆటో స్టాండ్ ఆవరణలో ఐఎల్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఐఎల్‌డబ్ల్యూఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే రైతు, కార్మికుడు, డ్రైవర్, హమాలీ, మేస్త్రీ, చిరు వృత్తిదారుడు ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కష్టపడే చేతులకు గౌరవం, కార్మిక కుటుంబాలకు భద్రత, ప్రతి కార్మికుడికి న్యాయం అందించడమే నిజమైన ప్రజాసేవ అన్నారు..మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గంలో నడుస్తూ అసంఘటిత కార్మికుల సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. కార్మికుడి చెమటే దేశ అభివృద్ధికి పునాది అని, కార్మికుడికి గౌరవం ఉన్నప్పుడే సమాజానికి నిజమైన గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎల్‌డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు సి. అమర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. భాస్కర్, హనుమాన్ ఆటో స్టాండ్ అధ్యక్షులు కె. మనోజ్ రెడ్డి, రాజన్న, శ్రీనివాసులు, సునీల్, జగన్, రాములు, మైలర్‌దేవ్‌పల్లి డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు యూ. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.