తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆప్కో కాలనీలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాలనీలోని చిన్నపిల్లలకు, వృద్ధులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అక్కేమ్ రాఘవేందర్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు గుమ్మడి కుమార్, మైస్ రెడ్డి, గాజుల నరేష్ యాదవ్, మాచర్ల చిరంజీవి, ఎర్వ మహేష్, పల్నాటి సతీష్, పవన్ గుప్తా, శివ పద్మశాలి, వెంకటేష్, రాము, సామల రాజు తదితరులు పాల్గొన్నారు.