తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో పాటు నియోజకవర్గ సీనియర్ నాయకుడు గణేష్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన పలు సమస్యలపై సానుకూల వాతావరణంలో చర్చించినట్లు సమాచారం.