తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  రాఖీ పౌర్ణమి సందర్భంగా మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని భావన ఋషి కాలనీలో ఉన్న శ్రీ మార్కండేయ ట్రస్ట్ భవనంలో భక్త మార్కండేయ స్వామికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్త మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు గాయత్రి ధారణ, గాయత్రి హోమం నిర్వహించారు. అనంతరం భక్తులు, స్థానికులకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పద్మశాలి కులబాంధవులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏర్వ సత్యనారాయణ, కాశీగారి యాదగిరి, ఉష్కమూరి విజయ్ కుమార్, ఉష్కమూరి శ్రీనివాస్, సామల యాదయ్య, ఏర్వ కుమారస్వామి, కైరం కొండ శ్రీనివాస్, ఇప్పలపల్లి చిరంజీవి, కొంపల్లి జగదీష్, సిద్దిరాల రాజ్ కుమార్, దశపతి బిక్షపతి, దశపతి రాజు తదితరులు పాల్గొన్నారు.

You missed