జమ్మికుంటలో పలు వార్డులను సందర్శించిన మున్సిపల్ చైర్మన్

వార్డు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్:

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గురువారం ఉదయం పట్టణంలోని పలు వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజలకు హాని కలిగించే విధంగా, ప్రమాదకరంగా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉండే నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాచర్ల రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేష్, మహేశ్, ప్రవీణ్, నూనిగంటి రాజు తదితరులు పాల్గొన్నారు.