తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహిళా, శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ శేరిలింగంపల్లి ప్రాజెక్టు పరిధిలోని మైలార్దేవ్పల్లి సెక్టార్ బాబుల్ రెడ్డి నగర్-2 అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ అనిత ఆధ్వర్యంలో అన్నప్రాశన వేడుక ఘనంగా నిర్వహించారు. ఆరు నెలల వయస్సు పూర్తి చేసుకుని ఏడో నెలలోకి అడుగుపెట్టిన చిన్నారికి సంప్రదాయ బద్ధంగా అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలతో పాటు ఆరు నెలల తర్వాత అదనపు పౌష్టికాహారం అందించడం ఎంతో అవసరమని వివరించారు. తల్లులు పిల్లల ఆరోగ్యం, పోషణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందిని, భాస్కర్, శ్రావణి, సురేఖ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
