మండల టాపర్ రితీష్‌కు రూ.10 వేల నగదు బహుమతి అందజేత

ఇల్లందకుంట:

చదువుకో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా 2025–2026 విద్యా సంవత్సరానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన పోటీలో ఇల్లందకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి తిప్పరబోయిన రితీష్ విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు విద్యార్థిని ఘనంగా సత్కరించారు.

మండల టాపర్‌గా నిలిచిన రితీష్‌కు రూ.10 వేల నగదు బహుమతి చెక్కును అందజేసి అభినందించారు. అనంతరం 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘చదువుకో తెలంగాణ’ బడ్జెట్ పోస్టర్‌ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తస్నీమ్, ఇల్లందకుంట ఎస్సై క్రాంతికుమార్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ జోన్ జమ్మికుంట బ్రాంచ్ ప్రతినిధులు, జమ్మికుంట డివిజన్ డివిజనల్ మేనేజర్ సతీష్, మేనేజర్ రాము, హుజూరాబాద్ మేనేజర్ రాజేష్ కన్నా, ఉద్యోగులు సాయి, సుకుమార్, రాకేష్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.