తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సాధన లక్ష్యంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని లిబర్టీ సర్కిల్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాల్గొని రాజ్యాంగ పరిరక్షణకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ పృథ్వీ చౌదరిని, గుత్తా అమిత్ రెడ్డిని యలమంచి ఉదయ్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి మౌలిక విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ, రాజ్యాంగ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ బి.ఎం. సందీప్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్క , అజారుద్దీన్, ఇతర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, పీసీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌ యూఐ, సేవాదళ్ నాయకులు, పార్టీ కార్యకర్తలతో పాటు టీమ్ యలమంచి ఉదయ్ కిరణ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.