తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొండాపూర్, కొత్తగూడ ప్రధాన రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాలను సిఎంసి అధికారుల ఆదేశాల మేరకు పరిసరాల పరిశుభ్రతలో భాగంగా సంబంధిత సిబ్బంది చెత్తచెదారాన్ని శుభ్రంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు, చెత్తను నాలాలలో, బహిరంగ ప్రదేశాలలో వేయకూడదని, వేసినవారికి జరిమానా విధించబడుతుందని సంబంధిత అధికారులు హెచ్చరిక చేశారని తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ, సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో చెత్తాచెదారాలను తొలగిస్తూ పరిసరాలన్ని ఆరోగ్యవాతావరణంతో ఉండేలా కృషి చేస్తున్నందుకు అభినందిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.