తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లో నూతనంగా చేపట్టనున్న సెవెరేజ్ లైన్ పనులను జలమండలి విభాగం, కాలనీ వాసులతో కలసి టెంకాయ కొట్టి ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ, నూతనంగా ప్రారంభించి, సెవెరేజ్ లైన్ పనులను జలమండలి విభాగం, కాలనీ వాసులతో కలసి పరిశీలించడం జరిగిందని, అలానే పనులను త్వరిత గతిన పనులు పూర్తిచేసి కాలనీవారికి అందుబాటులోకి తేవాలని అధికారులకు చెప్పారు. అలానే పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతిమేరకు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో డివిజన్ లో అత్యవసరం ఉన్నచోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తిచేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు. ఏ సమస్యైనా నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పారు. అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను పీఏసీ చైర్మన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకెపూడి గాంధీ సహకారంతో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు వారి సిబ్బంది, మంజీర నీరు లైన్మెన్ ఈశ్వర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.