తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మదినగూడ డివిజన్ పరిధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం, శ్రీ శనీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ తన సతీమణి యామిని దివ్యతో కలిసి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం, కార్యక్రమంలో పాల్గొన్న మిరియాల ప్రీతమ్, యామిని దివ్యను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ వార్షికోత్సవం, శ్రీ శనీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వినోద్ రావు, యాదగిరి, ఆంజనేయులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.