తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అచ్చంపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు విచ్చేయగా, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడారు. కల్వకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజా పాలన, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో కల్వకుర్తి నియోజకవర్గాన్ని సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సహకారం అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
