తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఉమ్మడి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్‌పూర్, 122వ డివిజన్‌లో తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ నీరుడు సర్వేష్ ముదిరాజ్, బి. ఇంద్ర, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర యువజన అధ్యక్షుడు కంచర్ల శివారెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లూరు ఆకాశ్‌కు మద్దతుగా పట్టభద్రులను కలిసి ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇవ్వాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.