• తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నందు జరిగిన ప్రజావాణిలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు కలెక్టర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన చేనేత కార్మికులందరికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా చేయూత ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని
జోగులాంబ గద్వాల జిల్లా లో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారు. వయస్సు మీదపడటం, అనారోగ్య సమస్యలు, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వంటి కారణాలతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత ఆసరా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికులందరికీ ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందనారు. కావున మా ప్రధాన డిమాండ్లను మీ దృష్టికి తీసుకువస్తున్నామనారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది
ప్రధాన డిమాండ్లు:
1. అర్హులైన చేనేత కార్మికులందరికీ చేయూత ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలి.
2. జియో ట్యాగింగ్ నిబంధనల కారణంగా అర్హులైన చేనేత కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలి.
3. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఎటువంటి అనవసర ఆంక్షలు లేకుండా పెన్షన్ మంజూరు చేయాలి.
4. భార్యకు పెన్షన్ ఉంటే భర్తకు ఇవ్వకూడదు, భర్తకు ఉంటే భార్యకు ఇవ్వకూడదు అనే నిబంధనను తొలగించి, అర్హత కలిగిన భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ మంజూరు చేయాలి.
5. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన చేనేత కార్మికుల దరఖాస్తులను పరిశీలించి వెంటనే మంజూరు చేయాలి.
చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో చేనేత కార్మికులు పోతు వీరేష్ వీరన్న మేడం వెంకటేష్ గోరంట్ల రవి తదితరులు పాల్గొన్నారు
