తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. ఆర్గనైజర్, ఫౌండర్ పి. ప్రవీణ్ కుమార్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సునీల్ కుమార్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన 1వ నేషనల్ కరాటే, కుంగ్ ఫూ ఛాంపియన్షిప్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, కరాటే, కుంగ్ ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ విద్యలు విద్యార్థుల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, సమయపాలన, ధైర్యసాహసాలను అలవాటు చేస్తాయని అన్నారు. నేటి యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందిస్తూ, విజేతలకు అవార్డులు అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రమ్య కృష్ణ, కూకట్పల్లి నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ చన్ను పాషా, డివిజన్ అధ్యక్షులు శంకర్, పులి శివకుమార్ గౌడ్, చందర్రావు, షహేన్షా, మస్తాన్ రెడ్డి, తూము సంతోష్, నాగార్జున, ధర్మారావు , ఇజాజ్ , తదితరులు పాల్గొన్నారు
