తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మసీద్ బండ గ్రామంలో ఎస్ఎంఆర్ లో ఏర్పాటు చేసిన నూతన స్కిన్ కేర్ సెంటర్ తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ తో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాపారంలో వృద్ధి చెంది మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిని, వ్యాపార, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
