తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని, భాగ్య నగర్ ఫేస్1కాలనీలో హైదర్ నగర్ దవాఖానలో రామ్ నరేష్ నగర్ రామాలయం లో నిజాంపేట్ మెయిన్ రోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్యేంటి హిల్స్ కమ్యూనిటీ హాల్ లో జల వాయు విహార్ కమ్యూనిటీ హాల్ లో హెచ్ఏంటి శాతవాహన బస్ట్ స్టాప్ లో సమతా నగర్ లోని 51సర్కిల్ కార్యాలయం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ?హైదర్ నగర్ డివిజన్ గౌరవ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు. ఈ సందర్బంగా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ విధిగా పల్స్‌ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని పోలియో చుక్కలు చిన్నారులకు శ్రీ రామ రక్షయని, తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని తమ చిన్నారులకు విధిగా వేయించాలన్నారు. ఆరోగ్య భారత్‌ను నెలకొల్పేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. పుట్టిన పాప నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు తెలియజేసారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం డివిజన్ లోని 8పోలియో కేంద్రాల్లో వైద్యారోగ్య సిబ్బందితో పిల్లలకు చుక్కల మందు వేస్తున్నట్లు తెలియచేశారు.