తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్, ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, సామాజిక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ఇటీవల మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏఎస్ రాజు నగర్లో కార్తీక మాస వనభోజనాలు మియాపూర్‌లోని ఏఎస్ రాజు నగర్ టెంపుల్ పార్క్‌లో ఆరోబిందో కాలనీ, దత్తసాయి నగర్ వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి నిర్వాహకులు, కాలనీ వాసుల ఆహ్వానం మేరకు యలమంచి ఉదయ్ కిరణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దత్తసాయి నగర్ అధ్యక్షులు స్వామి రవికృష్ణ , ఆరోబిందో కాలనీ ప్రతినిధులు రమేష్ , లోకేష్ తో పాటు పలువురు కాలనీ ప్రముఖులు, నివాసితులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్తీక మాస వనభోజనాల ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించడంలో ఇటువంటి సామూహిక వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల మధ్య సోదరభావం, ఆత్మీయత, పరస్పర పరిచయాలు మరియు ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. అనంతరం, మియాపూర్‌కు చెందిన గౌరవనీయులైన సీనియర్ సిటిజన్లు, ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందిస్తున్న గోపీనాథ్ , సుబ్బారాయుడు , హనుమంతరావు , సుబ్బారెడ్డి , వెంకట నాయుడు , విష్ణు ప్రసాద్ , శ్రీరామ్ , జనార్ధన్ తదితర పెద్దలను కలుసుకుని వారి ఆశీస్సులు, ఆదరాభిమానాలను స్వీకరించారు. పెద్దల ఆశీస్సులు, ప్రోత్సాహం తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శరత్, వంశీ, రత్నాచారి, సాయి నిఖిల్, నాగసాయి తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు అయిదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో మహమ్మారి నుంచి వారిని రక్షించాలని తల్లిదండ్రులకు యలమంచి ఉదయ్ కిరణ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన సందర్శించి, చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమని, అయిదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్య భద్రతకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలని కోరారు. పోలియో నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేపీ నగర్ అసోసియేషన్ సభ్యులు మోహన్ రెడ్డి, ఆంజనేయులు, జనార్దన్ రెడ్డి, శరత్, రత్నాచారి, వంశీ, సాయి నిఖిల్, నాగసాయి తదితరులు, కాలనీవాసులు పాల్గొన్నారు. కొండాపూర్ కమ్మసంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు కొండాపూర్ కమ్మసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి నిర్వాహకులు కొల్లి క్రాంతి, మద్దినేని శివ , కనిగంటి శశాంక్ ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘం కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ , మియాపూర్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, కార్తీక మాస వనభోజనాలు మన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కుటుంబ సభ్యులు, పెద్దలు, యువత, మహిళలు మరియు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆత్మీయత, సోదరభావం, పరస్పర సహకారం, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, యువత సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి ఐక్యత, పరస్పర గౌరవం, సహకారం ఎంతో అవసరమని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా చిట్‌చాట్ నిర్వహించారు. పలు సామాజిక, సాంస్కృతిక అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కొండాపూర్‌కు చెందిన గౌరవనీయులైన సీనియర్ సిటిజన్లు, పెద్దలు, కాలనీ ప్రముఖులు, స్థానిక కుటుంబ సభ్యులను కలుసుకుని వారి ఆశీస్సులు, ఆప్యాయతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చలసాని భారతి , రవి , శరత్, వంశీ, నాగసాయి, రత్నాచారి, సాయి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు, స్థానిక ప్రజల పెద్ద ఎత్తున పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ప్రజలతో మమేకమే నిజమైన ప్రజాసేవ ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం, ప్రజా సంక్షేమానికి తన వంతు కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. సీనియర్ సిటిజన్ల ఆశీస్సులు, యువత సహకారం, మహిళల భాగస్వామ్యం, కాలనీవాసుల ఆదరాభిమానాలతో సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, సామాజిక బాధ్యతతోనే అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు.
