తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో పాల్గొని పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, మెరుగైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాలింగ్ గౌతమ్ గౌడ్, లక్ష్మారెడ్డి, రవీందర్ అనిరుద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
