తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదుబండ గ్రామంలోని శ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనార్థమై అధిక సంఖ్యలో భక్తులు 21వ తేది శనివారం ఆలయానికి విచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులను పొందారు. ఈ సందర్భంగా భక్తజనులు మాట్లాడుతూ, శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి ఆశీస్సులను పొందినందుకు అదృష్టంగా భావిస్తున్నామని, ఆయురారోగ్యాలను పొందగలమని భక్తులు తమ ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేశారు. ఈ అదృష్టాన్ని కలుగజేసిన ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు.
