తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: మదీనాగూడ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామివారి 3వ వార్షికోత్సవ వేడుకల్లో మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈ వేడుకలకు హాజరైన మిరియాల ప్రీతమ్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కాలనీవాసులు, భక్తులు హాజరై వార్షికోత్సవ వేడుకల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం, నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ జనరల్ సెక్రెటరీ కిట్టు, వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, సూర్యనారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు