తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్ హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండా విజయ్ కుమార్ ప్రతి శనివారం నిర్వహిస్తున్న మధ్యాహ్న అన్నదాన కార్యక్రమానికి అశేష జనవాహిని తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో అన్నదాన కార్యక్రమానికి తరలివస్తున్న జనవాహినికి వడ్డించేందుకు తమ వంతుగా చేయూతనందిస్తున్న కొండా విజయ్ కుమార్ అభిమాన బృందంలోని ఒకరైన మహిళా సంఘ సేవకురాలు ఎస్. భీమమ్మ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ అందరిని ఆకట్టుకుంటున్నది. ఈ సందర్బంగ ఎస్. భీమమ్మ మాట్లాడుతు, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి అశేషమైన జనవాహిని తరలివస్తున్నందున అన్నదాన కార్యక్రమంలో భోజనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వయంగా వడ్డించి తమ వంతు సేవ అందజేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ సేవ చేసే అదృష్టాన్ని కలుగజేసినందుకు కొండా విజయ్ కుమార్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. భోజనాలను తృప్తిగా ఆరగించిన వారు మాట్లాడుతు, ప్రతి శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ కు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగేలా ఆశీర్వదించాలని కోరుతూ, నిండు మనస్సుతో అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వచనాలు పలుకుతున్నారు.
