తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్: ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో, ఆరోబిందో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో మియాపూర్‌లోని మొండో స్కోలరిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ వి. జగదీశ్వర్ గౌడ్ ,మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీఈఓ విద్యా హాజరై వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఇలాంటి మెగా వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. యలమంచి ఉదయ్ కిరణ్ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల చూపిస్తున్న చొరవను, నిరంతరం చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 400మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, అవసరమైన మందులు, ఆరోగ్యంపై తగిన సూచనలు అందించారు. అవసరమైన వారికి మమతా హాస్పిటల్ సహకారంతో ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించారు. సేవే నాయకత్వానికి పునాది మియాపూర్ ప్రాంతంలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న యలమంచి ఉదయ్ కిరణ్ ప్రజలతో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మెగా వైద్య శిబిరాలు, కంటి పరీక్షలు, మందుల పంపిణీ, వేసవి చలివేంద్రాలు, పేద విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్, జ్యామితీ పెట్టెల పంపిణీ, విద్యార్థులకు ఆర్థిక సహాయం, వృద్ధులకు పండ్ల పంపిణీ, అనాథాశ్రమాల్లో అన్నదానం, దివ్యాంగులకు సహాయం, యువత కోసం క్రీడా కార్యక్రమాలు, మహిళా సాధికారత కార్యక్రమాలు, పారిశుధ్య కార్మికులకు ఆహార పంపిణీ, పర్యావరణ పరిరక్షణ వంటి పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. లబ్ధిదారులకు అండగా నిలుస్తున్న వైద్య సేవలు గతంలో నిర్వహించిన వైద్య శిబిరాల ద్వారా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు, కంటి ఆపరేషన్లు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు తదితర వైద్య పరీక్షలు, చికిత్సలు పొందిన పలువురు లబ్ధిదారులు ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ, తమకు ఉచిత వైద్య చికిత్సలు అందించడంలో సహకరించిన యలమంచి ఉదయ్ కిరణ్ కి, మమతా హాస్పిటల్ యాజమాన్యానికి , క్యాంపు ఇంచార్జ్ ఆంజనేయులు కి కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా సుమారు రూ.2లక్షల వరకు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను ఉచితంగా పొందడంతో పాటు, ఆసుపత్రి అడ్మిషన్, రవాణా సౌకర్యం వంటి సహాయాలు అందడం తమకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పేర్కొన్నారు. సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ 9వ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతానికి సహకరించిన మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య బృందానికి, దాతలకు యలమంచి ఉదయ్ కిరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పాఠశాల ప్రాంగణంలో ప్రజోపయోగమైన ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు అవకాశం కల్పించిన మొండో స్కోలరిస్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ వడ్డే శివ ప్రసాద్ కి, ప్రిన్సిపాల్ కస్తూబా కి, కార్యక్రమ నిర్వహణకు సహకరించిన భవన యజమాని సత్యనారాయణ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోబిందో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ కి, జనరల్ సెక్రటరీ లోకేష్ కి, రమేష్ కి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, కాలనీ వాసులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమిష్టి సహకారంతోనే ఈ వైద్య శిబిరం విజయవంతమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో శ్రీమతి అనిత, జాహ్నవి, జ్యోష్ణ, పెద్దలు ఆలపాటి శివాజీ గారు, మహేశ్వర్ రెడ్డి, మన్నేపల్లి సాంబశివరావు, పట్వారీ శశిధర్, రవీంద్ర రెడ్డి, గణేష్, నడిమింటి కృష్ణ, రాంచందర్ గౌడ్, రవి కుమార్, సత్యనారాయణ, లక్ష్మణ్ రావు, మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సాంబశివరావు, శేరిలింగంపల్లి నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షులు నర్సింగ్ రావు, శ్రీనివాసు, శరత్, ప్రవీణ్, వంశీ, రత్నాచారి, సాయినిఖిల్, వినోద్, గిరి, అనిల్, కామినేని వాసు, కార్తీక్, వలభనేని నరసింహరావు, ప్రకాష్, సత్య, సతీష్, శేషగిరిరావు, శేఖర్, శశి, సుబ్బారావు, నరసింహారావు, శ్రీజిత్, రమేష్, గోపాల్, రాజేష్, వాసు, చాణుక్య, మహేష్, సుజాత, పద్మ, రాము, కిరణ్, వైభవ్, సత్యం, సత్యం, రేఖ, మధు, బాబ్జి, అంజన్ తదితర నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ: “ప్రజల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను నిర్వహించాం. 400మందికి పైగా ప్రజలకు వైద్య సేవలు అందించడం ఆనందంగా ఉంది. ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం, వారి సమస్యలను తెలుసుకుని సాధ్యమైన పరిష్కారానికి కృషి చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ప్రజాసేవ అనేది పదవులతో సంబంధం లేకుండా నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యత. విద్య, వైద్యం, యువత అభివృద్ధి, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సంక్షేమం వంటి రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతాం” అని తెలిపారు. “మానవ సేవే మాధవ సేవ” అనే స్ఫూర్తితో ప్రజల సంక్షేమం కోసం తన సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తానని యలమంచి ఉదయ్ కిరణ్ స్పష్టం చేశారు.
