తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ లోని మండల ప్రాథమిక పాఠశాల, జయప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్ లలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని వైద్య సిబ్బందితో కలిసి 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్. ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ, మియాపూర్ డివిజన్ లో పలు కాలనీలలో వైద్య సిబ్బంది, ఆశావర్కర్స్ తో కలిసి 0-5సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలువేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వారు సూచించారు. పోలియో వ్యాధి నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలియో రహిత భారతదేశమే మన లక్ష్యం అని, నినాదంతో చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు అని, ఉప్పలపాటి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బాలింగ్ వెంకటేష్ గౌడ్, బాలు నాయుడు, మహేశ్వర్ రెడ్డి, సాంబయ్య, నరేష్ నాయక్, రాజేశ్వరి, ఆశ వర్కర్స్ సుజాత, లక్ష్మీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.