తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లోని కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్న పోలియో చుక్కల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు హాజరై పిల్లలకు అందిస్తున్న పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ గారు మాట్లాడుతూ తల్లితండ్రులందరు బాధ్యతగా తీసుకుని ఐదు ఏళ్ల వయస్సు లోపు ఉన్న పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. పోలియో వ్యాధికి టీకా తప్ప మరోక పరిష్కరం లేదు కాబట్టి పిల్లల ఆరోగ్యం విషయంలో ఆశ్రద్ద వహించకుండా తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలని సూచించారు. కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, కొండారెడ్డి, సత్యనారాయణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
