తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మూసాపేట్ డివిజన్ పరిధిలోని బస్తీ దవాఖానాలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరై చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, పోలియో వ్యాధి బారిన పడకుండా చిన్నారులకు సకాలంలో పోలియో చుక్కలు వేయించడం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, డివిజన్ అధ్యక్షులు తూము సంతోష్, శంకర్, మస్తాన్ రెడ్డి, శివకుమార్ గౌడ్, చందర్రావు, నాగార్జున, షహేన్షా, ఎంసీ డైరెక్టర్ ఇజాజ్, కూకట్పల్లి నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ చన్ను పాషా తదితరులు పాల్గొన్నారు.
