తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పల్స్ పోలియో చుక్కలు వేసి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమీద్ పటేల్ తో పాటు సీనియర్ నాయకులు ఎన్. రూపారెడ్డి, డా. రమేష్ గౌడ్, రాజు, శ్యామల యాదవ్, కందుల సునీత తదితరులు పాల్గొన్నారు.