తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ , మిషన్ డైరెక్టర్,ఎన్ హెచ్ ఎమ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో “పోలియో దినం – ప్రతిసారి రెండు చుక్కలు, పోలియోపై నిరంతరంగా విజయం” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డిఏంహెచ్ఓ డా. సీ హెచ్ రాకేష్ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డా. ఉమా దీపిక, డా. మొహమ్మద్ అవైస్ తో కలిసి రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ విశిష్ట అతిథులుగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ మాట్లాడుతూ, 5ఏండ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఒక్క చిన్నారి కూడా చుక్కలు వేసుకోకుండా మిగిలిపోకూడదని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యువత, వైద్య సిబ్బంది కలిసి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, గఫుర్, యువ నాయకులు మిరియాల ప్రీతం, బాలింగ్ గౌతమ్ గౌడ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, వార్డు మెంబర్ పర్వీన్ బేగం, వార్డు మెంబర్ రాము, బాపునగర్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, శ్రీకాంత్ దేవులపల్లి, గోపినగర్ అంబేద్కర్ భవన్ ప్రెసిడెంట్ రమేష్, మల్లేష్, సుధాకర్ రెడ్డి, మల్లేష్, మహేందర్ సింగ్, నటరాజ్, సందీప్, మహేష్, హరీష్, సాయి, ముంతాజ్ బేగం, పారామెడికల్ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, తల్లిదండ్రులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.