తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కుతుబ్ షాహీ సమాధులు ఇబ్రహీం భాగ్ నందు, ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా నేడు “నేచర్ మీట్స్ హెరిటేజ్” వాక్ పేరిట నేచర్, హెరిటేజ్ వాక్, కుతుబ్ షాహీ సమాధులు నందు, తెలంగాణ వారసత్వ శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సంయుక్త సహకారంతో నిర్వహించాయి. ఈ యొక్క కార్యక్రమంలో హైదరాబాద్ లోని వివిధ ప్రదేశాల నుండి 50మంది వారసత్వ సంపద, ప్రకృతి పక్షుల ప్రేమికులు, వీక్షకులు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి తెలంగాణ టూరిజం నుండి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ , పబ్లిక్ రిలేషన్స్ శ్రీమతి మాన్వి , కె. సుమన్, చంద్రకాంత్ స్వాగతం పలికి, నేచర్ , హెరిటేజ్ వాక్ గురించి, వచ్చిన వారికి వివరించారు. అనంతరం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ వారసత్వ శాఖ సంచాలకులు ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప చారిత్రక, సాంస్కృతిక, పురావస్తు , వాస్తుశిల్ప వారసత్వానికి నిలయమని. చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు వాటి ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా కుతుబ్ షాహీ సమాధులు హైదరాబాద్ చరిత్రకు, కుతుబ్ షాహీ రాజవంశపు కళా వైభవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని వివరించారు. ఈ సమాధుల నిర్మాణంలో కనిపించే పర్షియన్, దక్కనీ , భారతీయ వాస్తుశిల్ప సంప్రదాయాల సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. హెరిటేజ్ వాక్ కి గైడ్ గా జావీద్, ఆసియా ఖాన్ వ్యవహరించగా నేచర్ వాక్ కి సుమన్, సిద్ధార్థ , ఒమర్ నేచరలిస్ట్ లుగా వ్యవహారించారు. ఈ యొక్క కర్యక్రమం కుతుబ్ షాహీ సమాధులలో వారసత్వ సంపద గురించి తెలుసుకుంటూ, మధ్యలో చెట్లు మరియు కనపడేటువంటి 40కి పైగా పక్షుల గురించి గైడ్లు , నేచరలిస్ట్ లు వివరణ చేస్తూ సాగింది. హెరిటేజ్ వాక్ అనంతరం సంరక్షణ ప్రాంతంలో బర్డ్ వాక్ చేస్తూ పక్షుల వీక్షణకు వచ్చిన వారు చూసిన పక్షులను పాకెట్ గైడ్ ద్వారా గుర్తిస్తూ, నిపుణులు పక్షుల వీక్షణ ఎలా చేయాలి, వాటిని ఎలా గుర్తించాలి, ఎలాంటి పక్షులు ఎలాంటి శబ్దాలు చేస్తాయి వంటి విషయాలను వచ్చిన వారికి వివరించారు. అలాగే స్థానిక , స్థానికేతర చెట్ల గురించి, వాటి మీద పక్షుల ఆవాసాల గురించి. చెట్ల యొక్క ఉపయోగాలు, వాటి ఔషధ విలువల గురించి వారికి వివరించారు. ఈ యొక్క బర్డ్ , నేచర్ వాక్ లో నల్ల యోట్రింత చిన్న పసరిక ముఖి పిట్ట,కోకిల, జనువాయి, మొదలగు పక్షులను వారు వీక్షించారు. “తెలంగాణ రాష్ట్రం గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదతో పాటు అపారమైన ప్రకృతి, జీవవైవిధ్య సంపదకు నిలయంగా ఉందని. ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో నిర్వహించిన వాక్ ద్వారా ప్రకృతి , చారిత్రక వారసత్వం మధ్య ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ప్రజలకు పరిచయం చేయడం మా ముఖ్య ఉద్దేశమని ఈ కార్యక్రమంలో సుమారు 50మంది ప్రకృతి, పక్షులు, వారసత్వ ప్రేమికులు పాల్గొనడం సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాలు యువతలో ప్రకృతి పరిరక్షణ, చారిత్రక కట్టడాల సంరక్షణ పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు, తెలంగాణలో బాధ్యతాయుతమైన, అనుభవాత్మక పర్యాటక అభివృద్ధికి దోహదపడతాయని ఆశిస్తున్నామని” తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి క్రాంతి వల్లూరు, ఐఏఎస్, తెలిపారు. అలాగే వచ్చే ఆదివారం 29న మా మూడవ నేచర్ వాక్ కార్యక్రమం నిర్వహించబోతున్నామని, ఆశక్తీ గల వారు 80192 49292 నంబర్ ను సంప్రదించాలని వారు కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ టూరిజం నుండి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ మరియు పబ్లిక్ రిలేషన్స్ శ్రీమతి మాన్వి, కె. సుమన్, డిప్యూటీ డైరెక్టర్లు డా. డి. రాములు నాయక్, నర్సింగ్ నాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్. ఓఎస్డి రాజు, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ప్రతినిధి మణికొండ వేదకుమార్, ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ప్రతినిధులు, మారేడు ప్రతినిధులు ఒమర్ మరియు సిద్ధార్థ, తెలంగాణ వారసత్వ శాఖ అధికారులు, తెలంగాణ టూరిజం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
