తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ , కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ గురువారం ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, డాక్టర్ బిఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాదని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మార్చ్‌ను విజయవంతం చేశారు.