మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 20 పాఠశాలలకు నిధుల కేటాయింపు
విద్యతో పాటు క్రీడా మైదానాలు, క్రీడా ఉపకరణాలకు అదనపు నిధులు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్:
హుజూరాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TGPS) మంజూరు చేయించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించేలా కృషి చేసినట్లు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన పాఠశాల విద్య అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 20 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. హుజూరాబాద్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.9.97 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా హుజూరాబాద్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు రూ.40 లక్షలు, వీణవంక మండలం చెల్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రూ.40 లక్షలు, వీణవంక మండలంలోని మోడల్ స్కూల్‌కు మరో రూ.40 లక్షల అదనపు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులను పాఠశాలల్లో క్రీడా మైదానాల అభివృద్ధి, క్రీడా ఉపకరణాల ఏర్పాటు తదితర అవసరాలకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి వాటిని ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రణవ్ తెలిపారు. విద్యతో పాటు క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నందున విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
హుజూరాబాద్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వొడితల ప్రణవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
