విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించడమే లక్ష్యం: ట్రస్ట్ వ్యవస్థాపకుడు సాయి చరణ్ లక్కీ

జమ్మికుంట నవంబర్ 27 తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్:

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వంశిక ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఎల్. సాయి చరణ్ లక్కీ శుక్రవారం పాఠశాలకు వాటర్ ప్యూరిఫయర్‌ను వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్యూరిఫయర్‌ను పాఠశాల సిబ్బందికి అందజేశారు.

ఈ సందర్భంగా సాయి చరణ్ లక్కీ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ పేద విద్యార్థులకు, సమాజానికి ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన సోదరుడు నిఖిల్, సోదరి నిహారిక, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), 17వ వార్డు కౌన్సిలర్ లక్ష్మణ్, 20వ వార్డు కౌన్సిలర్ కావ్య పరుషరామ్, యువశక్తి యూత్ సభ్యులు మారుతి, వినోద్, గరుడ యూత్ సభ్యులు రవితేజ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్యానికి ఉపయోగపడేలా వాటర్ ప్యూరిఫయర్ అందించిన సాయి చరణ్ లక్కీ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.