తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు వార్డు కార్యాలయంలో ప్రారంభించిన క్రమంలో జీవిత బీమా నమోదు కొరకు వచ్చిన వారందరికీ ఓర్పుతో సరైన ధ్రువీకరణ పత్రాలను పరీక్షించి జీవిత భీమా నమోదు ప్రక్రియను సంక్రమంగా పూర్తిచేస్తున్నారు. ఈ సందర్బంగ సంబంధిత అధికారులు మాట్లాడుతు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం నవంబర్19 నుంచి డిసెంబర్18వరకు నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5లక్షల జీవిత బీమా అందిస్తున్నారని, ప్రతి ఒక్కరూ సరైన ధ్రువీకరణ పత్రాలను చూపించి నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా కుటుంబంలో సంపాదించే వ్యక్తికి బీమా కల్పించి, అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. బీమా చేయించుకునే వారి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్, తెలంగాణ రేషన్ కార్డు, (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ ఆధార్ కార్డు వివరాలు, నామినీ మైనర్ అయితే గార్డియన్ వివరాలతో ధ్రువీకరణ పత్రాలు కావాలని తెలియజేసారు. కావున అర్హులైన వారు తమ పత్రాలను సిద్ధం చేసుకొని వార్డు కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించి బీమా నమోదు వివరాలు తెలుసుకుని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
