తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా అక్కలు, చెల్లెళ్లు, మహిళా నాయకులు ఆత్మీయంగా తరలివచ్చి టీడీపీ సీనియర్ నాయకులు యు. విజయ్ కుమార్‌కు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్కాచెల్లెళ్ల నుంచి లభించిన ఆత్మీయత, అభిమానం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. రాఖీ కట్టి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అక్కాచెల్లెళ్లందరికీ ఎల్లప్పుడూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని, వారి జీవితాలు ఆనందమయంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు.
