తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఉమా మహేశ్వరి రెడ్డి పాల్గొని క్రీడాకారులను అభినందించారు. దివ్యాంగ క్రీడాకారులు తమ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. క్రీడలు ప్రతి ఒక్కరిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొం దించడంతో పాటు సమాజంలో సమానత్వ భావనను బలోపేతం చేస్తాయని అన్నారు.మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని యువత క్రీడల వైపు అడుగులు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్రీడాకారులు, నిర్వాహకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.