తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కడ్తాల మండలం రావిచేడ్ గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేష్ కుమారుడు సాత్విక్ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం ఉదయం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరా మర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాత్విక్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటాయని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.