తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సామాజిక భద్రత పింఛన్లలో భాగంగా కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత కలిగిన వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, దివ్యాంగులు, ఫైలేరియా, థలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియా బాధితులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో అత్తాపూర్ సర్కిల్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఆర్పీ గుర్రం తిరుపతమ్మ తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. చేయూత పింఛన్ దరఖాస్తు ఫారాలను అధికారిక వెబ్‌సైట్ చేయూత.https: cheyutha. telangana.gov.in నుంచి పొందవచ్చని తెలిపారు.