తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని టీఎన్‌జీఓఎస్ కాలనీలో రేషన్ సరుకులు ఈ నెల ఇంకా తీసుకోని కార్డుదారులు ఈ నెల 30, 31 తేదీల్లో వచ్చి తమ రేషన్ సరుకులను తీసుకోవాలని రెక్సాన్ డీలర్ మసున సత్యనారాయణ ఒక ప్రకటనలో కోరారు. అర్హత కలిగిన రేషన్ కార్డుదారులు నిర్ణీత తేదీల్లో రేషన్ దుకాణానికి వచ్చి సరుకులు తీసుకోవాలని ఆయన సూచించారు.