తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విధులు నిర్వహిస్తున్న సమయంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ & కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం శివరాంపల్లిలో నివాసం ఉంటున్న పారిశుధ్య కార్మికుడు ఎస్. రామచంద్రయ్య (55) ను వనంపల్లి జైపాల్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్‌పల్లి డివిజన్ గగన్‌పాడ్ ప్రాంతంలో రామచంద్రయ్య పారిశుధ్య విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గగన్‌పాడ్–శాతంరాయి మధ్య సర్వీస్ రోడ్డులో చెత్తను తొల గిస్తున్న సమయంలో బైక్ ఢీకొనడంతో రామచంద్రయ్య రెండు మోకాళ్లకు, నడుముకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు.
పారిశుధ్య కార్మికులపై విధులు సక్రమంగా నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేయడమే తప్ప, వారు ప్రమాదాలకు గురైన ప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కనీసం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా ఒక్క అధికారి కూడా కార్మికుడిని పరామర్శించక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి, వారికి అవసరమైన వైద్యం, ఆర్థిక సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆరోగ్యం, భద్రతను పట్టించుకోకుండా కేవలం విధుల కోసం ఒత్తిడి చేసే ధోరణిని అధికారులు విడనాడాలని హెచ్చరించారు. ప్రమాదా నికి గురైన రామచంద్రయ్యకు న్యాయం జరిగేలా తక్షణమే సంబం ధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.