తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్: యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పవిత్రమైన రాఖీ పౌర్ణమి పర్వదిన శుభ సందర్బాన్ని పురస్కరించుకొని సోదర సోదరీమణులందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగ యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతు, మాటలకు అందని అనుబంధం, కాలానికి చెదరని బంధం, జీవితాంతం తోడుగా నిలిచే ఆత్మీయతే సోదర సోదరీమణుల బంధమని, ప్రేమ, ఆప్యాయత, రక్షణ, నమ్మకాలకు ప్రతీకగా నిలిచే ఈ అందమైన బంధం ఎల్లప్పుడూ మరింత బలపడాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యం నిండేలా కోరుకుంటున్నానని, ఈ పవిత్రమైన రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలికి, అందరికీ మనస్పూర్తిగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసారు.
