• ప్రధాన కార్యదర్శిగా పెండెం భాస్కర్.. కోశాధికారిగా గాజుల రాము
• ప్రమాణ స్వీకారం తేదీ: 02/09/2026 ఉదయం 10am, నర్సంపేట పద్మశాలి సంఘం
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, నర్సంపేట: నర్సంపేట పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా సంగీత టెక్స్‌టైల్స్‌కు చెందిన కూచన రవిందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పద్మశాలి సంఘం సభ్యులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కూచన రవిందర్కు సంఘం సభ్యులు, పద్మశాలి సమాజ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సంఘం ప్రధాన కార్యదర్శిగా పెండెం భాస్కర్, కోశాధికారిగా గాజుల రాము నియమితులయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి కూడా పలువురు పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు అభినందనలు తెలిపారు.
నూతన కార్యవర్గం పద్మశాలి సమాజ అభివృద్ధికి, సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. సమాజంలోని సభ్యుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా నూతన కార్యవర్గం ముందుకు సాగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వద్నాల నరేందర్, వేణు గోపాల్, రాంపెల్లి లింగమూర్తి, బాల్నే సర్వేశం, బాల్నే జగన్, మండల శ్రీనివాస్, పెండం శివానంద్, తుమ్మ ఏకాభ్రం, బంక పరమేశ్వర్, కూచన రాజు, శ్రీరాముల కోటేశ్వర్, పర్శ శ్రీధర్ కులబంధవులు తదితరులు పాల్గొన్నారు.
