తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  బీఆర్‌ఎస్‌ శంషాబాద్‌ 118వ డివిజన్‌ ఆధ్వర్యంలో యాదవ్‌ బస్తీలో బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు బస్తీలో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, మున్సిపల్‌ నీటి సరఫరా తదితర సమస్యలపై ప్రజల నుంచి వివరాలను సేకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని బీఆర్‌ఎస్‌ శంషాబాద్‌ 118వ డివిజన్‌ అధ్యక్షుడు కొల్లన్‌ ప్రదీప్‌రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను కేవలం వినడం మాత్రమే కాకుండా, వాటి పరిష్కారం కోసం అధికారులను నిరంతరం ప్రశ్నించి సమస్యలను పరిష్కరించడమే బస్తీ బాట కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ యాదవ్‌, జనరల్‌ సెక్రటరీ రాహుల్‌ అప్ప, వెంకటేష్‌, లక్ష్మణ్‌, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు జయకృష్ణ గౌడ్‌, బీసీ అధ్యక్షుడు అర్జున్‌, యువజన విభాగం ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ యాదవ్‌, సాతంరాయి సీనియర్‌ నాయకులు ప్రభాకర్‌, రాజు, వాజిద్‌, రవి, సీనియర్‌ నాయకులు జగదీష్‌ గౌడ్‌, వై. శ్రీనివాస్‌, నాయక్‌, ప్రవీణ్‌, శ్రీధర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.