తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :గణేష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక అల్పాహారం కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ… విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పాఠశాల దశలోనే పౌష్టికాహారం అందించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, చదువుపై మరింత శ్రద్ధ పెట్టేందుకు దోహదపడుతుందని తెలిపారు.
మండల విద్యా అధికారి శంకర్ రాథోడ్ మాట్లాడుతూ… విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించి వారిని శారీరకంగా, మానసికంగా బలంగా ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకుంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మాధవి మాట్లాడుతూ… విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే తరగతి గదుల్లో ఉత్సాహంగా పాల్గొని, వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్, ధనుంజయ్, ప్రేమ్ గౌడ్, సరికొండ వెంకటేష్, బస శ్రీనివాస్, పులిజాల వివేకానంద, నర్సింగ్ గౌడ్, కాశీగారి యాదగిరి, యంజాల మహేష్ రాజ్, గట్టయ్య, బొల్ల వెంకటేష్, పున్న కృష్ణయ్య, ఎల్లప్ప, పవన్ కుమార్, దసపతి రాజు, సీనియర్ ఉపాధ్యాయులు మాణిక్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
