తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజక వర్గం, మియాపూర్ లోని తరంగ బాంక్వెట్ హాల్లో 30వ తేదీ ఆదివారం ఉదయం గం.11:07.ని. సుమూహూర్తాన శ్రీమతి కొండా రమాదేవి శ్రీనివాసుల ఏకైక పుత్రిక పల్లవిదేవిని శ్రీమతి దొప్పలపూడి ప్రమీల శ్రీనివాసరావుల ఏకైక పుత్రుడైన హరీష్ కు ఇచ్చి అత్యంత వైభవోపేతంగా దివ్య కాంతులను విరాజిల్లుతున్న రంగురంగుల పుష్పాలతో అలంకరించబడిన అత్యంత సుందరమైన వేదికపై అంగరంగ వైభవంగా అత్యంత వైభవోపేతంగా జరిపించిన వివాహ మహోత్సవ వేడుకలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఆత్మీయులు అభిమాన జన సందోహాల మద్య ఆనందోత్సాహాలతో ఆత్మీయతతో నూతన వధూవరులైన పల్లవిదేవి హరీష్ లను మనస్పూర్తిగా హృదయపూర్వకంగా నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు వారిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నట్లుగా తెలియజేస్తూ ముత్యాల తలంబ్రాలతో నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులైన పల్లవిదేవి హరీష్ ల తల్లిదండ్రులు కళ్యాణ మహోత్సవ వేడుకలకు విచ్చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు తెలియజేశారు.