తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి: మహిళల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫ్యాషన్, డిజైనర్ వేర్ అందించే “SHE Designer Studio” గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం సోమవారం కూకట్‌పల్లిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, ప్రత్యేక అతిథి శ్రీమతి బండి లకుమ దేవి ముఖ్య అతిథులుగా హాజరై SHE Designer Studioను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, మహిళలకు నూతన ఫ్యాషన్‌కు అనుగుణంగా నాణ్యమైన డిజైనర్ దుస్తులు, వస్త్రాలు అందించేందుకు SHE Designer Studio ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ బాబు, గాదే శివ చౌదరి, రామారావు,రమణ, సంధ్య, కల్పన తదితరులు పాల్గొన్నారు. SHE Designer Studio నిర్వాహకులకు బండి రమేష్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.