తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, ప్రశ్నించే గొంతులను అణచి వేయడం సరికాదని అన్నారు.అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూనే మరోవైపు బీజేపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడేలా కార్యకర్తలను ప్రోత్సహిస్తోందని వారు ఆరోపించారు. కాటేడాన్ డివిజన్అ ధ్యక్షుడు గోదా పాండు యాదవ్‌ను గృహ నిర్బంధం చేయడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు.ప్రజల సమస్యలపై పోరాడుతున్న బీజేపీ నాయకులను నిర్బంధించినంత మాత్రాన పార్టీ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. దాడులు చేసినా ఎదుర్కొంటామని, నిర్బంధించినా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేయాలని చూస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.
