తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజీవ్ గృహకల్ప ఫేజ్–1లో గత పది రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్న డ్రైనేజీ సమస్యకు సోమవారం పరిష్కారం లభించింది. స్థానికుల సమస్యను కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చొరవతో వాటర్ వర్క్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. సమస్య పరిష్కారం కావడంతో ఆర్‌జీకే బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు, అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జీకే బస్తీ వాసులు తిరుపతి గౌడ్, శీను నాయక్, సైదుల్లా, రవీందర్, హైదర్ తదితరులు పాల్గొన్నారు.
